blog address: https://10tv.in/national/india-irctc-to-conduct-char-dham-yatra-in-new-normal-247399.html
keywords: India,irctc
member since: Jul 7, 2021 | Viewed: 576
india-irctc-to-conduct-char-dham-yatra-in-new-normal
Category: Travel
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు పర్యాటక ప్రదేశాలకు పర్యాటకు తరలివెళుతున్నారు. ఈ క్రమంలో చార్ ధామ్ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. “చార్ ధామ్ యాత్ర” ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ఏసీ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ‘చార్‌ధామ్ యాత్ర’ను ప్రారంభించింది. రామాయణ సర్క్యూట్‌లో నడుస్తున్న ‘శ్రీ రామాయణ యాత్ర’ రైలు ప్రజాదరణ పొందింది.దీంతో ఐఆర్‌సీటీసీ ‘దేఖో అప్నా దేశ్’ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ‘చార్‌ధామ్ యాత్ర’ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్ రైల్వేస్టేషన్ నుంచి సెప్టెంబర్ 18న రైలు బయలుదేరనుంది. ఈ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బద్రీనాథ్‌తో పాటు చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న‘మన’ గ్రామం, నర్సింగ్ ఆలయం (జోషిమత్) ఆలయం, పూరి గోల్డెన్ బీచ్, కోణార్క్ లోని సూర్యదేవాలయం, చంద్రభాగ బీచ్, ధనుష్కోడితో సహా రామేశ్వరం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, శివరాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారకతో సహా రిషికేశ్, జగన్నాథ్ పూరి ఆలయాలను ఈ యాత్రలో దర్శించుకోవచ్చు.
{ More Related Blogs }

